యోబు గ్రంథము

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42


చాప్టర్ 3

ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.
2 యోబు ఈలాగు అనెను
3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాకమగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.
4 ఆ దినము అంధకారమగును గాకపైనుండి దేవుడు దాని నెంచకుండును గాకవెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక
5 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక.మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక
6 అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాకసంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాకమాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.
7 ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాకదానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక
8 దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాకభుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించు దురు గాక.
9 అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక
10 అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని?
11 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?
12 మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని?
13 లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందునునేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును
14 తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.
15 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును.
16 అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును.వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.
17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు
18 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు
19 అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారుదాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.
20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?
21 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.
22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
23 మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.
25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.